హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): పొలాలు ఎర్రబారుతుంటే యూరియా కోసం దైన్యంగా రైతులు రోడ్లపై నిల్చుండడాన్ని చూస్తుంటే మళ్లీ సమైక్య పాలనలోని పరిస్థితులు కండ్లెదుట కదలాడుతున్నాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆవేదన వ్యక్తంచేశారు. స్వపరిపాలనలో అన్నదాతకు ఈ దుస్థితి వస్తుందని ఏనాడు అనుకోలేదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ అసమర్థతతోనే రైతులు ఎరువుల కోసం అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. రైతుల కోసం మేమున్నామంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులకు.. ఇప్పుడు రైతులు పడుతున్న వెతలు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. .