Minister KTR | పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు : మంత్రి కేటీఆర్
Minister KTR | ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Minister KTR | ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చి హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. ప్రజలు తొందరపడొద్దని.. ప్రజలు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు.
వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్ చెబుతారని పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని అన్నారు. ‘ ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి. ఖైరతాబాద్ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లు. కరెంటు గోస చెప్పక్కర్లేదు. అపార్ట్మెంట్ కిందకు వెళ్తే డీజిల్ కంపుతో ముక్కులు పగిలిపోయేవి. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్ స్టాల్, జిరాక్స్ సెంటర్లు నడుపుకోలేని అవస్థ. గణేశ్ పండగ వచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ.’ ఉండేవని గుర్తుచేశారు. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని.. మంచినీళ్ల సవులత్ మంచిగైందని.. రోడ్లు బాగైనయని.. పేదలకు కడుపు నిండా పింఛన్ వస్తున్నదని.. డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది వస్తున్నారని తెలిపారు. సంక్రాంతికి గంగిరెద్దు వచ్చినట్టుగా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్టు మాటలు చెప్పే వాళ్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More :
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

