KTR : ఆశా వర్కర్లపట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. సోమవారం పోలీసుల దాడిలో గాయపడిన ఆశావర్కర్లను పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసిన ఆశావర్కర్లపై పోలీసులు దౌర్జన్యం చేశారని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆశావర్కర్లపట్ల సోమవారం ఒక దుశ్శాసన పర్వమే కొనసాగిందని మండిపడ్డారు.
కనీసం మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకొని వెళ్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఆశా వర్కర్ల వేతనాలను రూ.18 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో వారు కోఠిలోని కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపితే దౌర్జన్యం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కారు చేసిన దుశ్శాసన పర్వాన్ని తెలంగాణ ఆడబిడ్డలు మరిచిపోరని అన్నారు.
‘మీరందరూ ధైర్యంగా ఉండండి.. మీ అందరికీ అండగా నేనున్నా..’ అని ఈ సందర్భంగా కేటీఆర్ భరోసా ఇచ్చారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకు ఆశా వర్కర్లు సేవలందించారని, వారిపై రేవంత్ రెడ్డి సర్కార్ దమన కాండను చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయిందని అన్నారు. ఆశా వర్కర్ల తరఫున అసెంబ్లీ తాము పోరాడుతామని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అడగడానికి వస్తే ఆడబిడ్డలని చూడకుండా నడి రోడ్డు మీద మగ పోలీసులతో దాడి చేయిస్తారా?
కరోనాను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకు సేవలందించిన ఆశా వర్కర్లపై రేవంత్ సర్కార్ దమన కాండను చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది.
— BRS Party (@BRSparty) December 10, 2024
v
కనీసం మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకొని వెళ్తారా?
కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ఆశా వర్కర్లు నిరసన తెలిపితే..
పోలీసులతో రేవంత్ సర్కార్ చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మరిచిపోరు.మీరు ధైర్యంగా ఉండండి.. మీ తరపున అసెంబ్లీలో మేము కొట్లాడతాం.
ఆశా వర్కర్లకు భరోసా… pic.twitter.com/B1pppYiMXt
— BRS Party (@BRSparty) December 10, 2024