సిద్దిపేట/సిద్దిపేట అర్బన్/నంగునూరు/అక్టోబర్ 10: సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వెల్లువెత్తుతున్నా యి. సోమవారం సిద్దిపేట పట్టణ అంబేద్కర్ మాలకుల సంఘం అధ్యక్షుడు భూ మయ్య, కౌన్సిలర్లు సాకి బాల్‌లక్ష్మి ఆనం ద్, గ్యాదరి రవీందర్, గ్యాదరి మహంకాళి రూ.51,116ను టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళం ఇచ్చారు. ఈ నగదును మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డికి అందజేశారు.
నంగునూరు మండలం జేపీతండా గ్రామస్తులతో పాటు సర్పంచ్ భూక్య భిక్షపతి నాయక్ టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు మండల అధ్యక్షుడు లింగంగౌడ్కు రూ.10,116 విరాళం ఇచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటి పరిధిలోని 3వ వార్డు రంగధాంపల్లి గ్రామస్తులు బీఆర్ఎస్కు రూ.1,11,111 విరాళం ఇచ్చారు. వార్డు కౌన్సిలర్ వంగ రేణుక తిరుమల్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, ఇతర కుల సంఘాలు విరాళాలు సేకరించారు.