హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానానికి చెన్నైకి చెందిన భక్తుడు భూరి విరాళం ఇచ్చారు. చెన్నైకి చెందిన భక్తుడు వర్ధమాన్ జైన్ రూ.6 కోట్ల చెక్కులను అందజేశారు. ఎస్వీసీకి రూ.5 కోట్లు, ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.కోటి విరాళం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు చెక్కులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాత వర్ధమాన్ జైన్ అందజేశారు.