మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 6: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లిలోని కృషి హోమ్ అనాథ పిల్లల ఆశ్రమానికి బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 17న కృషి హోమ్‌ను సంతోష్‌రావు సందర్శించారు. అక్కడి పిల్లల బాగోగుల కోసం తన వంతు సాయంగా రూ.2 లక్షల విరాళాన్ని అందిస్తానని ఆనాడు ప్రకటించారు. తను ఇచ్చిన మాట ప్రకారం రూ 2 లక్షల చెక్కును ఆదివారం మేడ్చల్ నియోజకవర్గ గ్రీన్ ఇండియా చాలెంజ్ ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీనేత మెట్టు శ్రీకాంత్‌రెడ్డి ద్వారా పంపించారు. కాగా అనాథ పిల్లల భవిష్యత్తు కోసం సహకారం అందించినందుకు సంతోష్‌కు ఆశ్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.