యాదగిరిగుట్ట ; యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్య విమాన గోపురం బంగారు తాపడానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు భారీ విరాళం సమర్పించారు. అనురాధ, రాంరెడ్డి దంపతులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం ఆలయ ఈవో భాస్కర్‌రావుకు అరకిలో బంగారాన్ని అందజేశారు. కుటుంబంతో వచ్చి స్వామివారికి బంగారం సమర్పించుకుని మొక్కు చెల్లించుకున్నట్టు రాంరెడ్డి తెలిపారు.