హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): 2026-27లో జరగనున్న గోదావరి పుష్కరాలకు నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం రాత్రి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్(పోచంపాడు)వద్ద శ్రీరాము డి, శివాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. పుష్కరాలకు నిధులు మంజూరు చేయాలని విన్నవించినట్టు ఆయన తెలిపారు.