హైదరాబాద్, ఏప్రిల్28 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థుల్లో పుస్తకపఠనాన్ని పెంపొందించేందుకు ‘షౌట్ ఔట్ ఫర్ చిల్డ్రన్స్ బుక్స్’ పేరిట కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు టీజీఎస్ డబ్ల్యూఆర్ సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థులకు నూతన పాతపుస్తకాలను విరాళంగా అందించాలని దాతలను కోరారు.
సరూర్‌నగర్ పాఠశాల, గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు, దాతలు 8919493096, 7702228608 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.