Dogs Running | గట్టు, నవంబర్ 13 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని అంబాభవాని జాతర సందర్భంగా శునకాలకు పరుగు పందెం పోటీలను గురువారం నిర్వహించారు. 18 శునకాలు పాల్గొనగా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పోటీలు రసవత్తరంగా కొనసాగాయి. కుచినెర్ల నైనా శునకం ప్రథమ, కర్ణాటక ఉప్పలపాడు రాఖీ శునకం ద్వితీయ, రాజాపురం ఆర్కే డాన్ తృతీయ విజేతగా నిలిచాయి. శునకాల యజమానులకు వరుసగా రూ.10 వేలు, రూ.5 వేలు, రూ.2 వేల నగదును నిర్వాహకులు అందచేశారు.