సుల్తానాబాద్రూరల్, ఏప్రిల్ 20 : ఇటుకబట్టీల ప్రాంగణంలో ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు దాడిచేయడంతో ఓ చిన్నారి మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకున్నది. ఒడిశాకు చెందిన బాబు బెహరా-సరస్వతి బెహరా దంపతులు నాలుగు నెలలనుంచి కాట్నపల్లి జీపీ పరిధిలోని ఓ ఇటుకబట్టీలో పని చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. సోమవారం ఇద్దరు చిన్నారులు బట్టీల వద్ద ఆడుకుంటుండగా కుక్కలు దాడిచేయడంతో పొలాల వైపు పరుగులు తీశా రు. ఈ క్రమంలో కుక్కలు దివ్య బెహరా (3) గొంతు కొరుకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.