హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): సిబిల్ సోరు రిపోర్టులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడమేంటని హైకోర్టు ప్రశ్నించిం ది. దీనిపై సమగ్ర వివరాలతో కౌంట ర్ దాఖలు చేయాలని రిజర్వు బ్యాంక్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
గతంలో పలుసార్లు ఆదేశించినప్పటికీ కౌంటర్లు దాఖలు చేయలేదని, మార్చి 17లోగా దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.