Minister Harish Rao | తెలంగాణ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య స్ఫూర్తి : మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao | తెలంగాణ (Telangana) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య Doddi Komaraiah) అని, ఉద్యమానికి కొమురయ్యని స్ఫూర్తిగా తీసుకున్నామని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) కురుమ సంఘం బహిరంగ సభలో పాల్గొన్నారు.
Minister Harish Rao | తెలంగాణ (Telangana) తొలి అమరుడు దొడ్డి కొమురయ్య Doddi Komaraiah) అని, ఉద్యమానికి కొమురయ్యని స్ఫూర్తిగా తీసుకున్నామని మంత్రి హరీశ్‌రావు (Minister Harish Rao) అన్నారు. సంగారెడ్డి (Sangareddy) కురుమ సంఘం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుమ భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఉగాది, శ్రీ రామనవమి తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని, యూనిట్ కాస్ట్ కూడా పెంచామన్నారు. సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారన్నారు.
పక్క రాష్ట్రాల్లో మోటార్లకు మీటర్లు పెట్టి కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకున్నారని, కేసీఆర్ మాత్రం మీటర్లు పెట్టేది లేదని స్పష్టం చేశారు. బాల్యవివాహాలను ఆపింది సీఎం కేసీఆర్ అని, కల్యాణలక్ష్మి 18 సంవత్సరాలు అర్హత పెడితే బాల్య వివాహాలు ఆగిపోయాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ శాఖ కావాలని ఆడిగామని, ఇప్పటివరకు ఎలాంటి అతిగతి లేదన్నారు. వాళ్లకి ఎప్పుడూ అంబానీ, అదానీ కావాలని ఆరోపించారు. హైదరాబాద్‌లో కురుమ జాతి ఆత్మగౌరవ భవనం రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు.
కొమురవెళ్లికి పట్టువస్త్రాలు సమర్పించిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కురుమలకు కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కేసీఆర్ ఏ పని చేసిన వాటికి దేవుళ్ల పేరే పెడుతారని, మల్లన్నసాగర్ నిర్మించినప్పుడు ఇది పూర్తవుతుందా? అని ప్రతిపక్షాలు హేళన చేశాయని గుర్తు చేశారు. కానీ, మూడున్నర సంవత్సరాల్లో పూర్తి చేసి కేసీఆర్ చూపించారన్నారు. ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంని టీడీపీ వాళ్లు వాడుకుని వదిలేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన కేసీఆర్ గురించి గొప్పగా చెబుతున్నారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

