ఆరేండ్ల బాలుడికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఉస్మానియా దవాఖానలో ఆరేండ్ల బాలుడికి కాలెయ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
- ప్రైవేటులో 30 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్.. ఉస్మానియాలో పూర్తి ఉచితంగా నిర్వహణ
- కోలుకున్న దాత, గ్రహీత.. ఇద్దరూ డిశ్చార్జి
సుల్తాన్‌బజార్, ఆగస్టు 3: ఉస్మానియా దవాఖానలో ఆరేండ్ల బాలుడికి కాలెయ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో రూ.30 లక్షలకుపైగా ఖర్చయ్యే ఆపరేషన్‌ను పూర్తి ఉచితంగా జరిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చెల్లాపూర్‌కు చెందిన పర్వతాపురం చెన్నయ్య, యశోద దంపతుల కుమారుడు సాయిప్రణీత్ (6) లివర్ సమస్యతో బాధపడుతూ నెల క్రితం ఉస్మానియాలోని గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంలో చేరాడు. విభాగం హెచ్‌వోడీ డాక్టర్ మధుసూదన్ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి బాలుడికి కాలేయ మార్పిడి అత్యవసరమని గుర్తించారు.
బాలుడి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో తండ్రి లివర్‌ను ఇవ్వడానికి ముందుకొచ్చాడు. 250 గ్రాముల లివర్‌ను సేకరించిన సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నిలోఫర్ పీడియాట్రిషన్, నెఫ్రాలజీ, అనస్థీషియా వంటి విభాగాల సమన్వయంతో సుమారు 20 గంటలపాటు శ్రమించి బాలుడికి లివర్ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. తండ్రి, కుమారుడు కోలుకోవడంతో గురువారం డిశ్చార్జి చేస్తున్నట్టు దవాఖాన సూపరింటెండెంట్ బీ నాగేందర్ చెప్పారు. జీవన్‌దాన్ డే సందర్భంగా దాత, గ్రహీతతో కేక్ కట్చేయించి వారిద్దరిని సత్కరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

