వరంగల్ చౌరస్తా, మార్చి 1: భార్య అనైతిక బంధానికి ఓ భర్త బలయ్యాడు. తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్‌రెడ్డి (37), ఫ్లోరామరియా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. సుమంత్ పీహెచ్సీలో డాక్టర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తుండగా ఫ్లోరా అతడి బంధువుల పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవారు. ఈ క్రమంలో ఫ్లోరా బరువు తగ్గేందుకు ఓ జిమ్ సెంటర్ వెళ్లగా అక్కడ కోచ్ శామ్యూల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో దపంతులకు తరచుగా గొడవలు జరిగేవి. 2019లో ఫ్లోరాకు జనగామ జిల్లా పెంబర్తిలో ప్రభుత్వ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. త ర్వాత రంగశాయిపేటకు బదిలీ కాగా ఇద్దరూ వరంగల్‌కు షిఫ్ట్ అయ్యారు. సమంత్ కాజీపేటలో క్లినిక్ నిర్వహిస్తూ ఉదయం వెళ్లి, రాత్రి వచ్చేవారు. దీంతో ఫ్లోరా.. శామ్యూల్ తర చూ కలుసుకోవడంతో మళ్లీ దంపతులు మధ్య గొడవలు జరిగాయి.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు ఫ్లోరా ప్రియుడితో కలిసి స్కెచ్ వేశారు. ఏఆర్ కానిస్టేబుల్ రాజు సహాయం తో శామ్యూల్ .. గత నెల 20న రాత్రి వరంగల్‌లోని ఉర్సుగుట్ట నుంచి భట్టుపల్లికి వెళ్లే రోడ్డులో డాక్టర్ కారు ను అడ్డగించి ఇనుపరాడ్లతో దాడిచేశారు. అపస్మారకస్థితిలో వున్న సుమంత్‌ను స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు గురువారం తిరిగి ఎంజీఎంకు తీసుకొచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న సుమంత్ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. పోలీసులు పంచనామా చేసి, అప్పగించగా సంగారెడ్డికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.