KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం అందింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని సుస్మితకు ఆర్థిక సాయం అందించేందుకు వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్-ప్రణయవాణి ముందుకొచ్చారు.
తన చదువు కోసం ఆర్థిక సాయం అందజేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని సుస్మిత ఇటీవల కేటీఆర్‌ను ట్విట్టర్(ఎక్స్) వేదికగా సాయం కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్.. సుస్మితకు సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో ముందుకొచ్చిన వైద్య దంపతులు డాక్టర్ చంద్రశేఖర్-ప్రణయవాణి ఆర్థిక సాయం చేశారు. ఈ సాయం పట్ల కుటుంబసభ్యులతో కలిసి వైద్య విద్యార్థిని సుస్మిత కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి సాయం అందించిన వైద్య దంపతులను కేటీఆర్ అభినందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమంతో పేద వైద్య విద్యార్థికి ఆర్ధిక సాయం
🩺”గిఫ్ట్ ఎ స్మైల్” స్పూర్తితో ఆర్ధిక సాయం చేయడానికి ముందుకొచ్చిన వైద్య దంపతులు
🩺వైద్య దంపతులను అభినందించిన కేటీఆర్ గారు
🩺కృతజ్ఞతలు తెలిపిన వైద్య విద్యార్థి సుస్మిత… pic.twitter.com/SF1HlPkLDm
— BRS Party (@BRSparty) July 21, 2025