వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దు
- అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం లేఖలు
- మంత్రి కేటీఆర్‌కు వక్ఫ్ బోర్డు చైర్మన్ కృతజ్ఞతలు

హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): జీవో నంబర్ 15 ప్రకారం వక్ఫ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం లేఖలు రాసినట్టు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ వెల్లడించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వక్ఫ్ భూముల పరిరక్షణకు చేపట్టిన చర్యలను వివరించారు. మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వటమే ఇందుకు ఉదహరణ అని పేర్కొన్నారు. మైనారిటీ సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలకు రుణాలు, ఇమామ్‌లు, మౌజంలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం తదితర అంశాలపై మంత్రి కేటీఆర్‌తో చర్చించినట్టు సలీమ్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KTR
- wakf lands
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

