ఐలాపూర్‌లో కమిటీ సిఫార్సులు అమలు చేయొద్దు
సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మండలం, ఐలాపూర్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఎలాం టి నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15నజారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను సమన్వయకర్తగా నియమిస్తూ ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది.
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్ మండలం, ఐలాపూర్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఎలాం టి నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15నజారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను సమన్వయకర్తగా నియమిస్తూ ఏడుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీకి ఐలాపూర్ గ్రామంలోని సర్ఫ్-ఎ-ఖాస్ భూముల అంశాలను పరిశీలించే బాధ్యతను అప్పగించింది. ఈ నేపథ్యంలో, 98 ఏండ్ల ఎంఏ షరీఫ్.. ఏప్రిల్ 11, 12 తేదీల్లో హైడ్రా, రెవెన్యూ అధికారులు బలవంతంగా తమ ఆస్తులను కూల్చివేశారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ కమిటీ ఏర్పాటు న్యాయస్థానం ఆదేశాలను పకన పెట్టేందుకు చేసిన ప్రయత్నమని సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదించారు. కార్యనిర్వాహకశాఖ న్యాయవ్యవస్థ అధికార పరిధిని దాటి వ్యవహరించిందని పేరొన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజన సూత్రాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని చెప్పారు. ప్రభుత్వం ‘లక్ష్మణరేఖ’ను దాటిందని ఆరోపించారు. కమిటీకి అప్పగించిన విధుల్లో చట్టపరమైన అధికారాన్ని ప్రస్తావించకపోవడం, చట్ట ప్రక్రియలకు సమాంతర చర్యగా ఉన్నదని అభిప్రాయపడ్డారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మురళీధర్‌రెడ్డి వాదిస్తూ, కమిటీ కేవలం వాస్తవాలను సేకరించడానికి ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇది సాధారణ కార్యనిర్వాహక చర్య మాత్రమేనని తెలిపారు. దీనిపై న్యాయపరమైన సమీక్షకు ఆసారం లేదని పేరొన్నారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. కమిటీ తన పనిని కొనసాగించేందుకు అనుమతి ఇచ్చా రు. అయితే ఆ కమిటీ తీసుకునే ఎ లాంటి నిర్ణయాలను అమల్లోకి తేవద్దని ప్రభుత్వానికి షరతు విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. కేసులో కీలక అంశాలు ఉన్నందున తుది విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పారు. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడుతామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

