నిరుపేదల ఇండ్లను కూల్చవద్దు.. ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డికి సీపీఐ నేతల విజ్ఞప్తి
ప్రభుత్వ భూముల్లో 50గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల్లో 50గజాల స్థలంలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి సహకరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. గురువారం సీపీఐ నాయకుల బృందం ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల హనుమకొండ జిల్లాలోని గుండ్ల సింగారంలో అమానుషంగా పేదల ఇండ్లు కూల్చివేసిన విషయాన్ని వేం నరేందర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో నిరుపేదలు 50గజాలలో ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న వారందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం సహాయం చేయకపోగా వారి ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి రోడ్డున పడవేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి వేంనరేందర్‌రెడ్డి స్పందిస్తూ.. పేదలకు తప్పకుండా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వేం నరేందర్‌రెడ్డిని కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈటీ నర్సింహ, తకళ్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

