మండల్ కమిషన్ సిఫార్సులు అమలుచేయాలి
బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన బీసీ మండల్ జయంతి కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొని మండల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
- శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి
- బీసీ జాతికి ద్రోహం చేయొద్దు : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
- బీసీలను నిర్లక్ష్యం చేస్తున్న అగ్రకుల ప్రభుత్వాలు : జాజుల
తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 25 : బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన బీసీ మండల్ జయంతి కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొని మండల్ చిత్రపటానికి నివాళులర్పించారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేయాలని కోరుతూ బీసీ సంఘం నేతలు ఆందోళన చేపట్టి పెద్దఎత్తున నినదిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీ కులాల లెక్కలు తీయడానికి కేంద్రం భయపడుతున్నదని ఆరోపించారు.
స్వాతంత్య్రం సిద్ధించి 80ఏండ్లు గడుస్తున్నా ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజలుగా ఉన్న బీసీలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న జనగణనలో బీసీ కులగణన చేయాలనే ఆందోళనకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపాలని కోరారు. లేకుంటే బీసీ జాతికి ద్రోహం చేసినవారవుతారని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. మండల్ కమిషన్ సిఫార్సులు అమలుచేయకుండా అగ్రకుల ప్రభుత్వాలు బీసీలను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. శ్రీనివాస్, కృష్ణ, గణేశాచారి, శ్యామ్, మహేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

