కూతురికి డీఎన్ఏ పరీక్షా?.. తండ్రి పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ఆస్తిలో కూతురుకు వాటా ఇవ్వాల్సి వస్తుందని.. అసలు ఆమె తన కుమార్తెనే కాదని ఓ తండ్రి ప్ర యత్నించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తండ్రి ఆస్తిలో వాటా కోరుతూ భీమునిపట్నంకు చెందిన దింగు కనకమహాలక్ష్మి విజయనగరం కోర్టులో దావా వేశారు.
హైదరాబాద్, మే 25(నమస్తే తె లంగాణ): ఆస్తిలో కూతురుకు వాటా ఇవ్వాల్సి వస్తుందని.. అసలు ఆమె తన కుమార్తెనే కాదని ఓ తండ్రి ప్రయత్నించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. వివరాల్లోకి వెళ్తే.. తండ్రి ఆస్తిలో వాటా కోరుతూ భీమునిపట్నంకు చెందిన దింగు కనకమహాలక్ష్మి విజయనగరం కోర్టులో దావా వేశారు. దీంతో ఆమె తన కూతురు కాదని, తన అన్నకు జ న్మించిందని నరసయ్యరెడ్డి వాదించడంతోపాటు ఆమెకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కో రారు.
ఈ వాదనను దిగువ కోర్టు కొట్టేసింది. తీర్పును సవాల్ చేస్తూ నరసయ్యరెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ తార్లాడ రాజశేఖరరావు ఇటీవల విచారణ జరిపారు. కుమార్తె హకులను తిరసరించేందుకు డీఎన్ఏ ప రీక్ష నిర్వహించాలని కోరలేరని స్ప ష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేశారు.
పితృత్వాన్ని సవాల్ చేసేందుకు డీఎన్ఏ పరీక్షను అస్త్రంగా చేసుకునే వీల్లేదని, చట్టంలో నిర్దేశించిన సాక్ష్యాలను, సమర్పించి నిరూపించుకోవాలని తీర్పు చెప్పడంతోపాటు నరసయ్యరెడ్డికి రూ.3 వేలు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని 2 వారాల్లోగా న్యాయసేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

