హైదరాబాద్ : రాజన్న సిరిసిల్లకు చెందిన దివ్యాంగ రచయిత్రి బూర రాజేశ్వరి (43) బుధవారం కన్నుమూసింది. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని నివాసంలో తుదిశ్వాస విడిచింది. రాజేశ్వరి కాళ్లతో ఎన్నో కవితలు రాసి పురస్కారాలను అందుకున్నది. సామాజిక, వర్తమాన అంశాలపై 350 వరకు కవితలు రాసింది. రాజేశ్వరి కవితలను సుద్దాల ఫౌండేషన్ పుస్తకం రూపంలోకి తీసుకురాగా.. ఈ బుక్‌ను రవీంద్రభారతిలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) ఆవిష్కరించారు. రాజేశ్వరి జీవితాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చింది. రాజేశ్వరి మృతికి మానేరు రచయితల సంఘం సంతాపం ప్రకటించింది.