హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం ప్రారంభం కావడంతో విధి నిర్వహణలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రెయిన్ కోట్లను హోంగార్డ్స్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పంపిణీ చేశారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. హోంగార్డులకు వేతనం, పరేడ్ అలవెన్స్, ఎక్స్గ్రేషియా పెంపు చేయడంతో పాటు హోంగార్డులకు ఐడీ కార్డులను, హెల్త్ కార్డులను ఇచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.
హోంగార్డులకు అమ లు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ప్రస్తుత సీజన్లో విధి నిర్వహణ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు ఉన్ని జాకెట్లను, రైన్ కోట్లను పంపిణీ చేస్తున్నమన్నారు. అధికారుల సూచనలు అనుసరించి హోంగార్డులు విధి నిర్వహణ అంకితభావంతో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం రమేష్, ఆర్ఐ శ్రీనివాసరావు, తెలంగాణ రీజియన్ హోంగార్డు కమాండెంట్ బి వెంకటేశ్వర్లు, స్టోర్స్ డి.ఎస్.పి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.