హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల హకుల కోసం పోరాడిన హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికి స్ఫూర్తి అని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక తెలిపారు. శనివారం కెల్లర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని 14 నైబర్ హుడ్ సెంటర్లకు ఈ-ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ చిన్న వయసులోనే చూపు, వినికిడి కోల్పోయినా హెలెన్ కెల్లర్ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం 26 జిల్లాల్లో 74 నైబర్ హుడ్ సెంటర్ల ద్వారా కమ్యూనిటీ మేనేజ్డ్ రిహాబిలిటేషన్ సర్వీసెస్ కార్యక్రమాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో అమలు చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.