జగిత్యాల : నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకల సందర్భంగా తనను కలిసే వ్యక్తులు బొకేలు, శాలువాల బదులు పేద విద్యార్థులకు పనికివచ్చే సామాగ్రి పంపిణీ చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
కొనుగోలు చేసే బొకేలు, శాలువలు, ప్లెక్సీలకు బదులుగా స్కూల్ విద్యార్థులకు పనికి వచ్చే పుస్తకాలు, పెన్నులను, స్కూల్ బ్యాగులను పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు పలువురు ధన్యవాదాలు తెలిపారు. శనివారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంపెల్లి హనుమాండ్లు, సర్పంచ్ పావని నగేశ్, పార్టీ మాజీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పలువురు నాయకులు మర్యాదపూర్వంగా కలిశారు.