హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖలో వాహనాలకు ఫ్యాన్నీ నంబర్ల కేటాయింపు, లావాదేవీల్లో జరిగిన అక్రమాలపై డా టాబేస్ ఆపరేటర్లు, అసిస్టెంట్ల(డీబీఏ)పై రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది డేటాబేస్ ఆపరేటర్లు, అసిస్టెంట్లను మంగళవారం రవాణాశాఖ విధుల నుంచి తొలగించింది. డీబీఏలు దొడ్డిదారిన ఫ్యాన్సీ నంబర్లను కేటాయించడం, అధికారులకు తెలియకుం డా లావాదేవీలు జరిపినట్టు ఫిర్యాదు లు అందాయి. దీనిపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, 56మంది డీబీఏలు అడ్డదారిన డబ్బులు సంపాదించినట్లు గు ర్తించారు. ఇందులో కీలకపాత్రధారులను వదిలేసి కేవలం డీబీఏలను విధుల్లోంచి తొలగించడంపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
రంగారెడ్డి అదనపు కలెక్టర్‌పై ఏసీబీ కేసు
రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అదనపు (రెవెన్యూ) కలెక్టర్ భూపాల్‌రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఆగస్టు 13న లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ మంగళవారం భూపాల్‌రెడ్డి బంధువుల ఇళ్లతోపాటు 4 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి, రూ.5.05 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను గుర్తించారు. అయితే రూ.4.19 కోట్ల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్టు నిర్ధారించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతో భూపాల్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ధరణి పోర్టల్‌లో ప్రొహిబిటెడ్ జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలంటూ ముత్యంరెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను రూ.8 లక్షలు డిమాండ్ చేయగా.. సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి ద్వారా లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.