హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో తమను ప్రతివాదులుగా చేరుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులోను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రైవేట్ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపే అధికారం సెషన్స్ జడ్జికి లేదని క్వాష్ పిటిషన్లో పేర్కొన్నా రు.
మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు జరిపేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలంటూ భూ పాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి నిరుడు నవంబర్ 7న దాఖలు చేసిన ప్రైవేట్ పిటిషన్‌ను ఈ ఏడాది జనవరి 12న భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. ఆ పిటిషన్లో రాజలింగమూర్తి లేవనెత్తిన అంశాలు తమ పరిధిలోకి రాబోవని తీర్పులో పేర్కొన్నది. దీనిపై రామలింగమూర్తి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించడంతో విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి.. జూలై 10న కేసీఆర్, హరీశ్‌రావుతోపాటు నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, ఎల్అండ్టీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు చట్టవిరుద్ధమని, మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపే అధికారం సెషన్స్ కోర్టుకు లేదని కేసీఆర్, హరీశ్‌రావు తమ క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం హైకోర్టు విచారణ జరుపనున్నది.