Kondal Reddy | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి కాన్వాయ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇటీవల ఆయన కామారెడ్డికి వెళ్లిన సమయంలో 15కు పైగా వాహనాలతో కాన్వాయ్, పోలీసు భద్రత కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆయన మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు.. అయినా అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత తగ్గించి, తమ్ముడికి మాత్రం భద్రత పెంచారంటూ కామెంట్ల వర్షం కురుస్తున్నది.