హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఐఏఎస్ అధికారుల కేటాయింపులో కేంద్రం మళ్లీ వివక్షను ప్రదర్శించింది. 2024 ఐఏఎస్‌ల కేటాయింపులో రాష్ట్రానికి కేవలం ఇద్దరినే కేటాయించగా, బీహార్‌కు మాత్రం 20 మందిని కేటాయించింది. రాష్ట్రానికి చెందిన ఇట్టెబోయిన సాయిశివాని, కర్ణాటకకు చెందిన సచిన్ బస్వరాజ్‌లను తెలంగాణకు కేటాయించింది. రాష్ర్టానికి చెందిన రావుల జయసింహారెడ్డిని పశ్చిమబెంగాల్, కే ఆదిత్యశర్మను ఆంధ్రప్రదేశ్‌కు, సాయిచైతన్య జాదవ్‌ను తమిళనాడుకు కేటాయించింది.
ప్రతి ఏటా ఐఏఎస్ అధికారుల కేటాయింపులో రాష్ట్రానికి వివక్ష ఎదురవుతూనే ఉన్నది. ఫలితంగా పరిపాలనా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇదే విషయాన్ని కేంద్రం వద్ద పలుమార్లు ప్రస్తావించారు. అధికారులను ఎందుకు కేటాయించడంలేదని నిలదీశారు.