e Challan | పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
e Challan | వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
e Challan | హైదరాబాద్ : రాష్ట్రంలోని వాహనదారులకు పోలీసు శాఖ పెండింగ్ చలాన్లు తక్షణమే చెల్లించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వాహనాల పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ రవాణా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లు, లారీలు వంటి ఇతర భారీ వాహనాలకు 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్ల పైగా చలాన్లు పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది.
గత ఏడాది ఇలాగే రాయితీ ప్రకటించడంతో 45 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్ల రుసుము వసూలైంది. ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్లతోపాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న పట్టణాల్లోనూ చలానాలు విధిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, ఎకడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరు నాటికి పెండింగ్ చలాన్ల సంఖ్య మళ్లీ రూ.2 కోట్లకు చేరుకోవడంతో మరోమారు రాయితీ ప్రకటించారు. నిర్ణీత వ్యవధిలో చలానాలాను చెల్లించేవారికే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

