ఖైరతాబాద్, జనవరి 26: హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఆదివారం రాత్రి నిర్వహించిన భారతమాత మహాహారతి వేడుకలో అపశ్రుతి జరిగింది. వేడుకల్లో భాగంగా పటాకులు కాల్చేందుకు రెండు బోట్లను ఏర్పాటు చేయగా, ప్రమాదవశాత్తు అందులోనే పేలి బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి.
బోటులో ఆరుగురు వ్యక్తులు ఉండగా, డ్రైవర్, అతని సహాయకుడికి మంటలు అంటుకుని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. మిగతా నలుగురు బోటు నుంచి దూకి సురక్షితంగా బయటపట్టారు. ప్రమాద సమయంలో పీపుల్స్‌ప్లాజాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. సెక్రటేరియట్(లేక్) పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.