దివ్యాంగుల పింఛన్ పెంచాల్సిందే!
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
- మీలు తీర్చేదాకా వదలం
- సమస్యలపై సర్కార్ను నిలదీస్తాం
- బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్ దుర్మార్గం: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 24 (నమస్తేతెలంగాణ): దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బయట దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులు కేటీఆర్ను కలిశారు. వినతిపత్రం అందజేసి కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో దివ్యాంగుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సంక్షేమ పథకాల కేటాయింపులో ప్రత్యేక కోటా వర్తింపజేశామని గుర్తుచేశారు. కానీ, దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీలిచ్చి ఓట్లను కొల్లగొట్టిందని తెలిపారు. గద్దెనెక్కి రెండున్నరేండ్లు అవుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. గోడు వెళ్లబోసుకొనేందుకు వచ్చిన వారిని అసెంబ్లీలోకి అనుమతించక పోవడంతో రోడ్డుపైనే వారిని కలిసి వినతిపత్రం తీసుకొన్నామని చెప్పారు. దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా అసెంబ్లీ లోపల, బయట పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. బుధవారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న దివ్యాంగుల నిరసన దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కేటీఆర్ ప్రకటించారు.
ప్రశ్నించే గొంతులపై కాంగ్రెస్ కత్తి
ప్రశ్నించే గొంతులను నొక్కుతూ కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడని, పింఛన్లు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించిన విద్యార్థులు, నిరుద్యోగులు, దివ్యాంగుల గొంతులు నొక్కుతుందని ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయాలని అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్ దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని ఆరోపించారు. 127 మంది గురుకుల విద్యార్థులు మరణించినా సీఎం రేవంత్రెడ్డికి చీమకుట్టినట్టయినా లేదని, కనీసం దీనిపై ఇంతవరకు స్పందించిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. పిల్లల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. స్కాలర్షిప్, ఫీజు బకాయిలు విడుదల చేయాలని, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్వీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

