హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు.
టెన్త్లో 500 మార్కులకుగాను నయేషా గోయల్ 497, సాహిల్ నితిన్ సోని 495, హర్మన్ జోత్యత్ సింగ్ 494 మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు. 488 ఆపైన మార్కులను 57 మంది, 475 ఆపైన మార్కులను 475 మంది, 450పైగా మార్కులను 1570 మంది సాధించినట్టు వివరించారు.
ఓవరాల్ స్కూల్ పాస్ పర్సంటేజ్ 99.50 శాతం, 90 బ్రాంచీల్లో 100 శాతం పాస్ పర్సంటేజ్ సాధించినట్టు వెల్లడించారు. అలాగే 12వ తరగతిలో 500 మార్కులకుగాను ఆఫాన్ అలిఫాకీ 492, ఏఎల్ శంకర్, అక్షత్ పాండే, రిమ్జిమ్ గోరై 491 మార్కులు, ఎంవీవీ హర్షవర్ధన్ 490 మార్కులు సాధించినట్టు తెలిపారు. మరో నలుగురు 489, 488, 487 మార్కులు, 486 మార్కులు నలుగురు, 485 మార్కులను ఏడుగురు పొందినట్టు పేర్కొన్నారు.