హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్ బీఈడీ పూర్తిచేసి, స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసినవారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుకు అర్హులేనని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆర్సీఐ మార్గదర్శకాలు, అర్హతల ప్రకారమే నియామకాలుంటాయని తెలిపింది. ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల్లో 220 స్కూల్ అసిస్టెంట్, ప్రాథమిక పాఠశాలల్లో 796 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియనుంది.