ఖలీల్‌వాడి, అక్టోబర్ 9 : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్యాంసుందర్‌రెడ్డి (86) అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లోని నివాసంలో మరణించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు శ్యాంసుందర్‌రెడ్డి అంతిమయాత్రను జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ నుంచి ప్రారంభించనున్నట్టు ఆయన కుమారులు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి (దిల్‌రాజు) తెలిపారు.