హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): షరతులతో కూడిన బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని టీజీఎఫ్డీసీ నూతన చైర్మన్ దిల్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిసింది. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఆధ్వర్యంలో జరిగిన భేటీలో ఆయన కోరినట్టు సమాచారం.
దీనిపై ఇప్పటికే సీఎం అసెంబ్లీలో ప్రకటన చేసినందున.. వీటిపై అనుమతి ఇవ్వబోమని, సినీ పరిశ్రమ కోరికను ప్రభుత్వానికి నివేదిస్తానని రవిగుప్తా హామీ ఇచ్చినట్టు తెలిసింది.