మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 29 : మహబూబ్‌నగర్ జిల్లా కోర్టులో డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్ సెంటర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి శనివారం ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు.
జస్టిస్ పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్ అర్అండ్బీ అతిథిగృహం వద్ద జిల్లా జడ్జి పాపిరెడ్డి, అదనపు జడ్జి కల్యాణ్‌చక్రవర్తి, కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ స్వాగతం పలికారు.