హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఉన్నతస్థాయి కమిటీ సిఫారసు మేరకు బోర్డు అనుమతితోనే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్‌సీఎస్) అమ లు బాధ్యతలను చలో మొబిలిటీ కంపెనీకి అప్పగించినట్టు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఏఎఫ్‌సీఎస్ అమలుకు డిజిటల్ టికెటింగ్ టెండర్ ప్రకటనను 2022 నవంబర్ 2న టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిందని తెలిపింది.టెండర్లో ఆరు కంపెనీ లు పాల్గొన్నాయని చెప్పింది. ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్, డిజిటల్ టికెటింగ్ సౌకర్యం ఒకటే సర్వీస్ ప్రొవైడర్ దగ్గరుంటే నిర్వహణ సులువుగా ఉంటుందని యాజమాన్యం భావించిందని తెలిపింది. ఇదే సమయంలో కేంద్ర ప్ర భుత్వ రోడ్డు రవాణా, రహదారుల శాఖ… ప్రజారవాణా వ్యవస్థలో సాంకేతికత అమలుకు రూ.20.97 కోట్లు సంస్థకు మంజూరు చేసినట్టు చెప్పింది. వీటితో ఐటిమ్స్‌ను సొం తంగా కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించిన మేరకు టెండర్‌ను 2023 జూలై 3న ర ద్దు చేసినట్టు చెప్పింది.
ఏఎఫ్సీఎస్ను అమ లు చేయాలనే ఉద్దేశంతో 2024 జనవరి 11న మరో టెండర్ ప్రకటనను సంస్థ విడుద ల చేసిందని వెల్లడించింది. డిజిటల్ టికెటిం గ్, ఆన్లైన్ రిజర్వేషన్, ఐటిమ్స్ కొనుగోలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నిర్వహణ అంశాల ను వేర్వేరుగా పేరొంటూ జారీ చేసిన టెండర్లో మూడు కంపెనీలు పాల్గొన్నాయని చె ప్పింది. వాటి సేవలు సంతృప్తికరంగా లేనందున టెండర్‌ను ఫిబ్రవరి 29న రద్దు చేసినట్టు తెలిపింది. ఏఎఫ్‌సీఎస్ కోసం సంస్థ ఉన్నతస్థాయి కమిటీని నియమించిందని చెప్పింది. ఈ కమిటీ పలు రాష్ట్రాల్లో పర్యటించి, ఇతర కంపెనీలతో బేరీజు వేసుకుని చలో మొబిలిటీకి బాధ్యతను అప్పగించాలని ప్రతిపాదించినట్టు వెల్లడించింది. చలో మొబిలిటీ సంస్థకు క్యూఆర్ బేస్డ్ మొబైల్ టికెటింగ్, క్లోజ్డ్ లూప్ స్మార్ట్‌కార్డ్స్, మొబైల్ పాసెస్, ఎన్సీఎంసీ కార్డుల జారీలో విశేష అనుభవం ఉందని పేర్కొన్నది. ఈ కంపెనీ బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సపె్లై అండ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్ (బెస్ట్)లో 3500 బస్సుల్లో సమర్థసేవలను అందిస్తున్నదని తెలిపింది. సంస్థ టెండర్, ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రమేయం ఉండదని, పూర్తిగా బోర్డు అనుమతి మేరకే సంస్థ లో నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్పింది.