హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేసేవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియకు ఆర్టీసీ యాజమాన్యం రెడీ అయింది. ఇందుకు సంబంధించి బండ్లగూడ, దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోల్లోని 140 బస్సుల్లో ఇప్పటికే డిజిటల్ చెల్లింపులను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ సేవలకు విశేష స్పందన రావడంతో మరో రెండు నెలల్లో గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల్లో డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి తీసుకురానున్నారు. ప్రయాణికులు గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం, క్యూఆర్ కోడ్ సానింగ్తో పాటు క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్‌తో టికెట్ కొనే వెసులుబాటు అందుబాటులోకి రానున్నది.
తాడ్వాయి, అక్టోబర్ 18: ములుగు జిల్లా మేడారం సమ్మక్క దేవత తలపతి చందా శేషగిరి గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్నప్పుడు ఛాతీలో నొప్పి రాగా, గమనించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.