హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రాగల మూడురోజులు వివిధ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేరొన్నది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం ఆదిలాబాద్, నల్లగొండ, వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.