హైదరాబాద్, మే17 (నమస్తే తెలంగాణ): గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన డైట్, కాస్మొటిక్ చార్జీలు, భవనాల అద్దె బిల్లులు రూ.221.24 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. విద్యార్థులకు సంబంధించి బిల్లులను ప్రతినెలా చెల్లిస్తామని తెలిపారు.