జయశంకర్ భూపాలపల్లి, జూలై 12 (నమస్తే తెలంగాణ): రేషన్ బియ్యం కోసం ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేషన్ షాపునకు నడిచి వెళ్లి వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులోని పలిమెలలో జరిగింది. జయశంకర్ భూపాపల్లి జిల్లా పలిమెల మండలం బోడాయిగూడెంకి చెందిన కాపుల పోషక్క (65) రేషన్ బియ్యం కోసం 3 కిలోమీటర్ల దూరం లో ఉన్న పలిమెలకు నడుచి వెళ్లింది. దాహం వేయడంతో రేషన్ షాపు పక్కనే ఉన్న ఇంటి వద్ద కూర్చుని నీళ్లు తాగి కుప్పకూలిపోయిం ది. చుట్టపక్కల వాళ్లు వచ్చి ఆమెను దవాఖానకు తరలించేలోపే మృతి చెందింది. గ్రామస్థులు వృద్ధురాలి మృతదేహాన్ని బోడాయిగూడేనికి తరలించారు. పోషక్క కొన్నేండ్ల క్రితం పంకెన గ్రామం నుంచి పలిమెలకు వలస వచ్చి తన అక్క దగ్గర ఉంటున్నది. ఆమెకు దగ్గరి బంధువులు ఎవరూ లేరని, అంత్యక్రియలు చేయడానికి సైతం దిక్కు లేని పరిస్థితి అని తెలిపారు.
చిట్టీల వ్యాపారి వేధింపులు.. వాచ్‌మన్ ఆత్మహత్య
మూసాపేట, జూలై12: చిట్టీల వ్యాపారి వేధింపులతో మనస్తాపం చెంది ఓ వాచ్‌మన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూకట్పల్లి సీఐ ముత్తు, ఎస్సై ప్రేమ్‌సాగర్ కథనం ప్రకారం.. మూసాపేట ప్రగతినగర్‌లోని శ్రీసాయికృష్ణ క్లాసిక్ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కనకరాజు కుటుం బంతో అందులోనే ఉంటున్నాడు. అపార్ట్మెంట్లో ఉండే చిట్టీల వ్యాపా రి ఉషారాణి వద్ద కనకరాజు చిట్టీ వేశాడు. కొన్ని రోజులుగా చిట్టీ డబ్బు లు కట్టకపోవడంతో ఈనెల 11న రాత్రి కనకరాజుతో ఉషారాణి భర్త గొడవ పడ్డాడు. మనస్తాపం చెందిన కనకరాజు శుక్రవారం అపార్ట్మెంట్లోని పార్కింగ్ స్థలంలో మెయిన్ పవర్ బోర్డ్ విద్యుత్తు వైరు పట్టుకొని చనిపోయాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.