హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బస్సు ఎక్కుడుంది? ఎప్పుడొస్తుంది? అనేది తెలుసుకునే సౌలత్ను ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ‘ఆర్టీసీ బస్సు ట్రాకింగ్’ యాప్‌తో బస్సు వేళలు, కదలికలను తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. బస్సు నంబర్లతో సహా మొత్తం వివరాలు ఇందులో ఉంచింది. దీంతో పాటు ప్రయాణికులు తమ ఫీడ్ బ్యాక్‌ను కూడా అందులో పొందుపరిచే అవకాశాన్ని కల్పించామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
కొద్ది రోజుల క్రితమే దీన్ని అందుబాటులోకి తెచ్చినా, మొదట రిజర్వేషన్ బస్సులకు మాత్రమే యాప్‌ను అనుసంధానం చేసింది. అనంతరం జిల్లాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, రాజధాని తదితర బస్సుల్లోనూ వినియోగిస్తున్నారు. జిల్లాల్లో నడిచే 4,170 బస్సుల్లో ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. సిటీ బస్సులో డ్రైవర్ సీటు వెనుక, కండక్టర్ వద్ద క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.