హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఆహారం అందించే డైట్ ఏజెన్సీలు, భద్రత, పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీల్లో దళితులకు 16 శాతం కోటా కల్పించినందుకు దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్& ఇండ్రస్ట్రీ (డిక్కీ) ప్రతినిధుల బృందం బుధవారం మంత్రి హరీష్ రావును కలిసి శాలువాతో సత్కరించారు. దళితులకు 16 శాతం కోటా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఇందుకు సహకరించిన మంత్రి హరీష్ రావుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దళితులు ఆర్ధికంగా ఎదిగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. హరీశ్‌రావును కలిసిన వారిలో డిక్కీ జాతీయ అధ్యక్షుడు పద్మశ్రీ నర్ర రవికుమార్, నేషనల్ ఫుడ్ ప్రొసెస్సింగ్ హెడ్ సురేష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ మునిధర్, స్టేట్ హాస్పిటాలిటి హెడ్ సీతారాం, స్టేట్ ట్రైబల్ హెడ్ శ్రీరామ్ ఆనంద్ ఉన్నారు.