పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న 85 పడకల ప్రభుత్వ దవాఖానలో అంధకారం అలుముకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి బుధవారం సాయంత్రం 4 గంటల వరకు కారు చీకట్లో ఉండాల్సి వచ్చింది. ఐసీయూ, సాధారణ ఓపీ, ఎమర్జెన్సీ మెడికల్ విభాగం, జనరల్ ఐపీ గదులకు విద్యుత్తు సరఫరా లేక రోగులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కిడ్నీ బాధితులకు డయలాసిస్ సేవలు నిలిచిపోయాయి.