హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో సమస్యల పరిష్కారం సహా క్షేత్రస్థాయి నుంచి సూచనలు స్వీకరించేందుకు సంస్థ సీఎండీ బలరామ్ నూతన ఒరవడికి శ్రీకారంచుట్టారు.
శనివారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఔత్సాహికులు 040 -23311338 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.