హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించవద్దని, ఆ చట్టంలో మార్పులు చేయాలనుకోవడం తగదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఎంబీభవన్‌లో శనివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడారు.
భూ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించరాదని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి నిర్ణయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రాష్ట్రంలో కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతాంగ సమస్యలు పరిషరించాలని కోరుతూ 29న రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నట్టు ప్రకటించారు. ‘హైడ్రా’ పేరుతో నాటకాలాడొద్దని, దురాక్రమణలను నిర్మూలించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొన్నారు.