హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏ, వీఆర్వోలు( VRA,VRO ) ధర్నా(Dharna) చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలవడానికి వీఆర్ఏ, వీఆర్వోలు సీఎం ఇంటికి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో జీవో నంబర్ 81, 85 పై పునఃపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు వెంటనే కల్పించాలన్నారు. గత కొన్ని నెలలుగా ఉద్యోగం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉద్యోగ సంఘాలు, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కమిటీ పేరుతో, ఎన్నికల పేరుతో, వర్షాలు వరదల పేరుతో కాలయాపన చేస్తూ వారి జీవితంతో ఆడుకోవద్దని హితవు పలికారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలకు మద్దతిచ్చి, అధికారంలోకి వచ్చాక విస్మరించటం తగదన్నారు. వెంటనే వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న VRA, VRO లు.
సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన VRA, VRO లు..
సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో జీవో నంబర్ 81 & 85 పై పునపరిశీలించాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగిన VRA, VRO లు. pic.twitter.com/0zZUIajuWL
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2024