మహబూబాబాద్ : హక్కుల సాధన కోసం ఆశా వర్కర్లు(Asha workers) కదం తొక్కారు. ఆశాలపై బెదిరింపులు, వేధింపులు అరికట్టి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్( Mahbubabad) జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆశాల తోటి స్పటం బాక్సులు మోయించడం, సబ్ సెంటర్లు ఉడిపించడం, తూడిపించడం చేయొద్దన్నారు.
అలాగే బీపీ షుగర్ టెస్టులు చేపించరాదని, ఆన్లైన్ పనులు చేయించడం మానుకోవాలన్నారు.
పీహెచ్ నుంచి సబ్ సెంటర్కు మందులు, వ్యాక్సిన్ కిట్లు కూడా మోయించరాదని తెలిపారు. పెండింగ్లో ఉన్న పల్స్ పోలియో లెప్రసీ సర్వేలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెసీ పీహెచ్లలో ఆశాలకు విశ్రాంతి గది ఏర్పాటు చేయాలి. ప్రతి ఆదివారతో పాటు నెలలో అదనంగా రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఏవోకి వినతి పత్రం అందజేశారు.