హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): చేనేత రుణమాఫీతోపాటు నేతన్నల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈనెల 20న చేనేత జౌళిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలిపారు. బుధవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతన్నలకు హామీ ఇచ్చి రెండేండ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. 12 ఏండ్ల నుంచి ఎన్నికలు లేకుండా ఉన్న సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.